ఎవరు -4

349 Words
నేను వెనక్కి తిరిగి వెళ్తూ, “ఇంకేముంది, నేను మళ్ళి ఇంకో ఉపాధి చూసుకోవాలి. నాకు ఉన్న ఒకే ఒక అవకాశం మహేష్ భూపతి. ఆయనని ఎలాగైనా కాకా పట్టాలి. రేపు వచ్చేసరికి కొలనుకు వెళ్లి పుష్ప గుచ్చంతో ఎదురు వెళ్ళాలి. మరుసటి రోజు ఉదయం పనివారు అందరూ మహేష్ భూపతి కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా అదే వరుసలో పుష్ప గుచ్చంతో నిలుచున్నా. వాతావరణంలో మార్పులు వచ్చాయి. నల్లని మేఘాలు భవంతిని చుట్టేశాయి. కారు మబ్బులు అని చాల పుస్తకాలలో చదివాను కానీ అవి ఇంత భయంకరంగా ఉంటాయి అని అనుకోలేదు. కారు వచ్చి గేట్ ముందు ఆగింది. వర్షం జోరు అందుకుంది. మేము అందరం భవంతి నీడ కిందకి వెళ్లి పోయాము. ఆగిన కారులో నుండి ఎవరూ కిందకు దిగలేదు. కాసేపటికి ఇంజిన్ సౌండ్ పెరిగింది, కారు వర్షంలో కదలట్లేదు అనిపించింది. దర్శన చిత్రపాటి గొడుగు తీసుకొని వెళ్లి మహేష్ భూపతిని లోపలికి హడావిడిగా తీసుకుని వచ్చాడు. నాకు ఆయన కనీసం కనిపించలేదు కూడా. గుమ్మం దగ్గర ఆగారు. నాకు వెనకనుండి అమ్మాయిలు మహేష్ భూపతికి హారతి ఇవ్వటం కనిపిస్తుంది. ఆ అమ్మాయిలు హారతితో పాట పాడుతుంటే, పోతన మహేష్ గారితో మాట్లాడ్తున్నారు. మహేష్ భూపతి హారతి తీసుకోవటానికి చేతులు చాపారు, గట్టిగా ఒక మెరుపు, ఆ శబ్దానికి హారతి కింద పడిపోయింది. అంతా నిశబ్దం, పోతన ఆ అమ్మాయిలను ఏదో అంటుండగా, మహేష్ భూపతి చెయ్యి పైకి ఎత్తి, ఆపమని సైగ చేసి నడుచుకుంటూ లోపలి వెళ్లిపోయారు. ఆ రోజు అంతా ఎడతెగని వర్షం, అంతటి వర్షంలో నాకు రేపు మహేష్ గారితో పరీక్షా సమావేశం అని కబురు వచ్చింది. అర్థరాత్రి అయ్యింది కానీ నాకు నిద్ర రావట్లేదు. నా దగ్గర విద్యా పత్రాలు కానీ, ఉద్యోగం ఖరారు చేసినట్టు భూపతి గారు పంపిన లేఖ గాని లేవు. అవి సంచితో పాటే పోయాయి. “పోతన వంటి మంచి వారు, అనుభవజ్ఞులు ఉండగా నాకు ఇస్తారా?” అదే సమయంలో బయట నుండి ఒక వెలుగు కిటికీ లోనుంచి వచ్చి, గోడ మీద పడింది. పోతన గారేమో అనుకున్నా, కానీ ఆయన ఇంట్లోనే ఉన్నారు. కిటికీ నా తల దగ్గర ఉండటం వల్ల , పడుకున్న నాకు ఆ వెలుతురులో నుండి నలుగురు, ఐదుగురు మనుషుల నీడ వెళ్లినట్టు కనిపించింది. పోతనని పిలుద్దాము అనుకుని అటు వైపుకు తిరిగాను. పోతన అప్పటికే లేచి ఉన్నారు. చేతిలో కత్తి పట్టుకుని, ఆ పక్కన ఉన్న తాళాలు తీసుకుంటున్నాడు. విచిత్రమైన కూత ఒకటి వినిపించింది. వెనక్కి తిరిగి నా వైపు చుసాడు. నేను కళ్ళు మూసేస్కుని నిద్ర నటించాను. కళ్ళు మెల్లగా తెరుస్తున్న నాకు అతను కత్తితో నా వైపే వస్తునట్టు కనిపించింది. భయం తో గుండె వేగం పెరిగింది. లేచి పరుగెడదాం అనే సమయానికి కిటికీ తలుపు మూసిన శబ్దం, దాని వెనక మళ్ళి ఆ విచిత్రమైన కూత. అడుగలు దూరం వెళ్ళటం వినిపించి కళ్ళు తెరిచాను. పోతన తలుపు తీసి తాళాలు బయట వాళ్ళకిచ్చాడు. తాను కూడా బయటకి వెళ్లి, మెల్లగా తలుపు దగ్గరికి వేసాడు. నిద్రించే అంత నిర్లక్ష్యం లేదు, వెంబడించే అంత ధైర్యమూ లేదు. అప్పటి వరకు అయోమయంగా ఉన్న నా పరిస్థితి ఆందోళనగా మారింది. ***
Free reading for new users
Scan code to download app
Facebookexpand_more
  • author-avatar
    Writer
  • chap_listContents
  • likeADD