ఎవరు -5

269 Words
అమ్మాయి-అవకాశం“ఈ చోటు అంత మంచిది కాదు. అందులోనూ నీలాంటి భయస్తులు ఇక్కడ ఉండటం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండు.” తెల్లవారు ఝామున నిద్ర పట్టటం వల్ల, ఉదయం చాలా ఆలస్యంగా లేచాను. లేచిన వెంటనే బయటకి వచ్చి భవంతి వైపు చూసాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. దగ్గరకు వెళ్లి గమనించాను. అంతా మాములుగానే ఉంది. ఎవరి పనిలో వారు ఉన్నారు. మనసు కొంచెం కుదుట పడింది. అప్పుడు నాకు పరీక్షా సమావేశం ఉంది అని గుర్తుకు వచ్చి, ఉరుకు పరుగులు మీద పనులన్ని ముగించుకుని భవంతిలో మహేష్ భూపతి గారి ఆఫీస్ కి బయలుదేరాను. “ఎందుకు ఆ హడావిడి? పెద్దవాళ్లు ఎప్పుడు ఆలస్యంగా వస్తారు! నువ్వు కంగారు పడి, ఆ కంగారులో తిక్క తిక్క సమాధానాలు చెప్పి ఉన్న అవకాశం చెడగొట్టుకోకు.” అని మనసులో నాకు నేనే సర్దిచెప్పుకొని లోపలికి అడుగుపెట్టాను. అప్పటికే ఆయన నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కళ్ళలో కోపం స్పష్టంగా కనిపించింది. నాకు కంగారు మొదలైంది. “రా రాయుడు… కూర్చో” నేను కుర్చీలో కూర్చున్నా. ఆయన ఏవో దరఖాస్తులు చూస్తున్నారు. రాజసం ఆయన వేస్కున్న బూట్ల నుండి పెట్టుకున్న టోపీ వరుకు కనిపిస్తుంది. బట్టలే కాదు, మనిషి మొహంలో కూడా ఆ కళ కనిపిస్తుంది. దరఖాస్తులు పక్కన పెట్టి, “Are you ready?” ఇంగ్లీష్! లండన్లో చదువుకుని వచ్చారు కదా. నాకు ఆయన అడిగిన ప్రశ్న కాస్త ఆలస్యంగా అందింది. “సిద్ధంగానే ఉన్నాను అండి.” గంభీరంగా “నేను అడిగినా దానికే సమాధానం చెప్పు, ఎక్కువ తక్కువ కాదు, సూటిగా చెప్పు. ముందు నాన్నగారు పంపిన లేఖ చూపించు.” “పోయింది సార్” “Certificates ఉన్నాయా?” “లేవు సార్” ఆయన పాము లాగా బుస కొడుతూ సర్రుమని లేచారు, కుర్చీలో నుండి “ఎందుకు వచ్చావు అయ్యా ఏమి లేకుండా? సమయం విలువ తెలియదు, సమావేశ పద్ధతులు తెలియవు? ఆ గెడ్డం చూడు!” “జ్ఞానంకి కొలమానమా, విద్య పత్రాలు? పత్రాలు లేకపోయినా జ్ఞానం ఉంది. పద్ధతులు ప్రవర్తనలో ఉంటాయి గాని గెడ్డంలో కాదు కదా సార్.” కాస్త వెటకారంగా “జ్ఞానం అన్నావు కదా, నీటి యొక్క శాస్త్రీయ సూత్రం చెప్పు?” “తెలియదు సార్” నా మాటలో వణుకు నాకు తెలుస్తుంది. ఆయనకు చిరాకు వచ్చింది. “నీకు ఇంకా ఏమి తెలుసు?”
Free reading for new users
Scan code to download app
Facebookexpand_more
  • author-avatar
    Writer
  • chap_listContents
  • likeADD