ఎవరు -3

268 Words
మరుసటి రోజు ఉదయం కాఫీ తాగుతుంటే, ఆమె నీటి నుండి బయటకు వచ్చిన దృశ్యం కళ్ళలో మెదలాడింది. “అలా అలా మెదలుతున్న ఆమె రూపం నిజంగా అందంగా ఉంటుందా! లేక ఇది నా ఊహ? మొహం చూశానో లేదో కూడా తెలియని నాకు ఎందుకు ఈ పులకింత? కలయిక కోసం కలువ కోన దగ్గరికి మళ్ళీ వెళ్లాలా? లేక ఆ కుమారి కోసం కలవరిస్తున మనసుకి కంచె కట్టాలా?” అంతలో ఒక పనివాడు వచ్చి “మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు” అని చెప్పి వెళ్లి పోయాడు. అక్కడికి వెళ్లిన నా కోసం పోలీసు ఎదురు చూస్తున్నాడు. పక్కనే పోతన గారు కూడా ఉన్నారు. నేను వెళ్తుంటే పోతన నా గురించి ఆయనకు ఏదో చెప్తున్నటు తెలుస్తుంది. నన్ను పైకి కిందికీ పరిశీలనగా చూసాడు. నాకు పోలీసుని మామూలుగా చూస్తేనే భయం. ఇతను అనుమానంగా చూస్తుంటే ఇంకా భయం వేసింది. పోతన వైపు చూసి తల అడ్డంగా ఊపాడు. అదే సమయంలో వెనక నుండి ఒక 50 యేళ్ళ వయసుకి దగ్గరలో ఉన్న ఒక అతను నడుచుకుంటూ వచ్చారు. పైన తలపాగా, కోటు. కింద పంచి, గుండె దగ్గర బంగారపు పథకం, కొర్ర మీసం.. చూడటానికి జమీందారులా ఉన్నారు. పోతన: “ఈయన, దర్శన చిత్రపాటి, భూపతి రాజు గారి ప్రాణ స్నేహితులు.” నేను నమస్కారం పెట్టాను. పోతన నా వివరాలు చెప్పాడు. దర్శన చిత్రపాటి పోతనతో, “నువ్వు ఉండగా ఇతను ఎందుకు? పంపించేయక పోయావా?” పోతన: “రాజు గారు ఎలాగో పోయారు. కానీ, ఆయన మాట పోకూడదు” దర్శన: “నిజమే! నీ విద్యా పత్రాలు, ఉద్యోగం ఖరారు చేసినట్టు భూపతిగారు పంపిన లేఖ దగ్గర పెట్టుకో. రేపు ఆయన వారసుడు మహేష్ భూపతి ఇక్కడికి వస్తారు. ఆయనతో మాట్లాడు, నీ ఉద్యోగం విషయం ఆయనే చూసుకుంటారు.” పోలీస్ దర్శనతో ఏదో చెవిలో చెప్పాడు. దర్శన చిత్రపాటి ఆక్సిడెంట్ ని ఊద్దేశిస్తూ, “ఆ రోజు నువ్వు తప్ప ఈ ప్రాంతానికి ఎవరు కొత్త వారు రాలేదు.” పోలీస్ కన్ను ఆర్పకుండా నన్నే చూస్తున్నాడు. “నన్ను అనుమానిస్తున్నారా వీళ్లు? దానికి నేను ఏమి సమాధానం చెప్పాలి?” నా మౌనం ఆయనికి నచ్చలేదు. పోలీస్ నన్ను చూసి “సరే నువ్వు వెళ్ళు, నాకు తెలియకుండా నువ్వు ఊరు దాటకూడదు.” నేను అక్కడే నిలబడ్డాను. పోతన: “నువ్వు వెళ్ళు బాబు”.
Free reading for new users
Scan code to download app
Facebookexpand_more
  • author-avatar
    Writer
  • chap_listContents
  • likeADD