ఎవరు -6

283 Words
“ఈ భూపతి ఎస్టేట్స్ మొత్తం 3256 ఎకరాలు, అందులో అడివి ప్రాంతం కాకుండా ఆదాయం ఇచ్చే భూములు సుమారు 800 ఎకరాలు. ప్రధానంగా కాఫీ, టీ మరియు వరి పంటలు ఉంటే, ఏటా వీటి వల్ల వచ్చే ఆదాయం లక్ష రూపాయలు పైనే. వీటికి తోడు ఈ ప్రాంతం లో 40 కి పైగా సరస్సులు ఉన్నాయి. ఊరిలో తొంభై శాతం మందికి ఆదాయం భూపతి ఎస్టేట్స్ లో పని వల్లే వస్తుంది. ఈ భవంతిలో ఇద్దరు వంట వాళ్ళు, ఎనిమిది పనివారు, ముగ్గురు తోటవారు పని చేస్తున్నారు. రోజుకి ఇక్కడ అయ్యే ఖర్చు సుమారు 120 రూపాయలు.” మహేష్ భూపతి: “నువ్వు చెప్పిన వివరాలు కొంత వరకు మాత్రమే నిజం.” ఆ మాట విని చాలా నిరుత్సాహంగా అనిపించింది. ఇంతకీ నీకు పెళ్లి అయ్యిందా?” “కాలేదు సార్.” నేను చెప్పిన అన్ని సమాధానల్లో ఆయనకు నచ్చింది ఇది ఒకటే అనిపించింది. మహేష్ గారికి పెళ్లి అంటే పడదు అని పనివారి దగ్గర విన్నాను. “మంచిది.” తన పక్కనే ఉన్న చెక్క బీరువాలో నుండి, ఎస్టేట్ మ్యాప్ మరియు ఆదాయము వివరాలు ఉన్న కొన్ని పుస్తకాలు నాకు ఇచ్చారు. ఇక నుండి ఈ ఎస్టేట్ బాధ్యత నీది. ఆ రోజు సాయంత్రం పోతన అతిధి గృహానికి వచ్చి, తన సామానులు సర్దుకుంటున్నాడు. అప్పుడే లోపలికి వెళ్లిన నేను, “రేపు వెళ్ళండి పోతన గారు, ఇప్పుడు చాలా చీకటి పడింది కదా.” “నాది కాని చోట నిముషం కూడా ఉండ లేను బాబు.”కాసేపు ఆగి, “నిన్న రాత్రి మీరు లేరు, ఎక్కడికి వెళ్లారు?” “ఎక్కడికి వెళ్తాను?” కాస్త బెరుకుగా. “దాహం వేసి లేచాను, మీరు కనిపించలేదు.” “ఓ అదా! ఏదో పందికొక్కు వంట గదిలో గొడవ చేస్తుంది అని, వంట వాడు వస్తే, తాళం తీసుకుని వెళ్ళాను.” అబద్ధం అతికినట్టు చెప్పారు. ఆయన సర్దుకొని వెళ్లిపోతూ, “ఈ చోటు అంత మంచిది కాదు. అందులోనూ నీలాంటి భయస్తులు ఇక్కడ ఉండటం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండు.” ఆయన మాటలు బెదిరింపుల్లా అనిపించాయి. మరుసటి రోజు ఉదయం, కొత్త హుషారుతో కాఫీ తోటకి వెళ్లిన నాకు వర్షం ఎదురు వచ్చింది. తడవకుండా ఉండాలని పనివారు అందరూ పరుగులు తీశారు. వర్షం అంటే చిరాకు పడే నాకు ఆది అంత చిరాకుగా అనిపించలేదు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా. పొగమంచు వల్ల కాస్త దూరంగా ఉండే జనం స్పష్టంగా కనిపించట్లేదు, అలికిడి మాత్రం తెలుస్తుంది.
Free reading for new users
Scan code to download app
Facebookexpand_more
  • author-avatar
    Writer
  • chap_listContents
  • likeADD