ఎవరు -9

399 Words
కాస్త లోనే ఆమె కనుమరుగు అయ్యింది. వర్షం కూడా కాస్త ఊపు అందుకుంది. నేను ఒక పెద్ద చెట్టు కింద చేరాను. పొగమంచు మెల్లగా తొలగిపోతుంది. తొలగిపోతన్న మంచులో నుండి ఆమె కనిపించింది. నా ఊహ కన్నా అందంగా ఉంది ఆమె మోము. తడవకుండా గొనె సంచి కప్పుకుని, ఎదురుకుండా ఉన్న చెట్టు కింద నిలబడి ఉంది. కానీ ఆ చెట్టు చిన్నది కావటంతో వర్షపు చినుకులలో ఆమె తడవటం నాకు కనిపించింది. కొత్త వారితో ఎప్పుడు నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడకుండా ఉండలేకపోయాను. “ఓ అమ్మాయి! అక్కడ తడుస్తునావు కదా, ఇక్కడికి రా.” ”మీరే ఇక్కడికి రండి” చిలక పలుకులు లాంటి ఆ మాట విన్న నా ఒళ్ళు పులకరించింది. ఎంతటి మహాభాగ్యం! చిన్న చెట్టు, పైన వర్షం, పక్కన అందమైన అమ్మాయి. ఇంత కన్నా అదృష్టం ఉంటుందా అనుకుని ఆమె వద్దకు చేరాను. ఆమె నేను అటు వెళ్ళగానే నేను ఇంతకు ముందు ఉన్న చెట్టు కిందకి చేరింది. “ఓయ్! ఇది ఏమి బాలేదు” “ఆ అవును, ఆ చెట్టు కింద అంత బాలేదు, అందుకే ఇటు వచ్చా” అని ఒక చిరు నవ్వు విసిరింది. “ఇది పద్ధతి కాదు” “ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అనుకోవటం కూడా పద్ధతి కాదు.” మాటలు రాలేదు. మనుసు ఆమె సొగసుకు బానిస అయ్యిపోయింది. అంతలో వేరే అమ్మాయిలు కూడా ఆమె వద్దకు వచ్చారు. అందరూ కాఫీ తోటలో పని చేసే వారిలా ఉన్నారు. ఆమె వాళ్ళతో ఏదో చెపింది. అందులో ఒక అమ్మాయి, “ఏంటి అలా తడిచిన ఆడ పిల్లలను చూస్తున్నావు? తినేస్తావా? అయ్యను పిలవమంటావా?” తప్పుగా చూడకపోయినా ఎవరూ తెలియని ఊరిలో గొడవ ఎందుకు అనిపించి అక్కడ నుండి ఇంటికి బయల్దేరాను. దారిలో అంతకు ముందు భవంతిలో కలిసిన పోలీస్ అతను సైకిల్ మీద నా దగ్గరకు వచ్చి, తన సైకిల్ వెనుక ఉన్న సంచి నాకు ఇస్తూ “ఇది నీదే కదా!” “అవునండి” “పోతన చెప్పినట్టుగా, ఈ సంచి దొరికిన చోట ఏ జట్కా బండి లేదు, దిగువ అంత వెతికాము.” “అసలు నిజంగానే ప్రమాదం జరిగిందా లేక కథ చెప్పావా?” “కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.” “అది నేను చెప్పాలి. నువ్వు చెప్పిన వివరాలకి, దొరికిన ఆధారాలకి పొంతన లేదు. నీ సంచిలో నీ వివరాలు కూడా లేవు.” నా విద్యా పత్రాలు మరియు భూపతి రాజు గారు నాకు పంపిన లేఖ కోసం నా సంచిలో చూసాను. కానీ అవి కనిపించలేదు. “నువ్వు నాతో స్టేషన్ కి రావాలి.” అదే సమయానికి మహేష్ భూపతి గారు కారులో అక్కడికి వచ్చారు. “మా మేనేజర్ తో మీకు ఏమి పని?” “మీ నాన్న గారి కేసు గురించి విచారించటానికి ” పోలీస్ గొంతులో మర్యాద, భయము. “ఏమి విచారించాలి? ఇతని మీద అనుమానమా? సబ్ ఇన్స్పెక్టర్ తో నిన్నే మాట్లాడాను, ఇతని మీద అనుమానం ఏమి లేదు అని చెప్పాడు.” అతను మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు ఇతను మా మేనేజర్, మా మనిషి. పోలీస్ స్టేషన్ కి వస్తే మా మర్యాద పోతుంది. ఏదైనా ఉంటే రేపు మీ ఇన్స్పెక్టర్ ని ఇంటికి రమ్మనండి. “రాయుడు, నువ్వు కారు ఎక్కు.” పోలీస్ ఏమి మాట్లాడలేదు. నేను కారులో కూర్చున్నా, జరుగుతున్న ఏ విషయము నాకు అంతు చిక్కట్లేదు. నాకు తెలియకుండా నేను ఎవరి ఉచ్చులో అయినా పడ్తున్నానా? ***
Free reading for new users
Scan code to download app
Facebookexpand_more
  • author-avatar
    Writer
  • chap_listContents
  • likeADD